ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు
ప్రజాశక్తి - వంగర : మడ్డవలస రిజర్వాయర్‌లో మత్స్యకారులకు చెందిన 15 బోట్లు, వలలు గల్లంతయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్‌లో నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో వలలు, బోట్లు కొట్టుకుపోయినట్లు మత్స్యకారులు గురువారం తెలిపారు. బోట్లు, వలలు గల్లంతవడంతో వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గల్లంతైన బోట్లు, వలలను గుర్తించి, నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)