గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంట పొలాలు పరిశీలించిన మంత్రి అచ్చెన్న

1 గంట క్రితం

పంట పొలాలు పరిశీలించిన మంత్రి అచ్చెన్న. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 05:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

------పురుషోత్తమ సాగర్ గండి.

------పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని.

అధికారులకు ఆదేశాలు

ప్రజాశక్తి - టెక్కలి రూరల్ : టెక్కలిలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విస్తృత పర్యటన చేశారు. పురుషోత్తం సాగర్ గండి పడడంతో మెలియాపుట్టి రహదారిని పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం విస్తృతంగా పరిశీలించారు. పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రహదారులను స్వయంగా పరిశీలించారు. రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖల అధికారులతో పరిస్థితిపై సమీక్షించి, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. పాడైన రహదారులకు మరమ్మతులు చేపట్టడంతో పాటు, కొత్త రహదారుల ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అన్ని గ్రామాలకు నూతన రహదారులు వేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని రహదారులు, పంచాయతీరాజ్, ఐటీడీఏ అధికారులకు సూచించారు.

పురుషోత్తం సాగర్ గండి పడి సుమారు 70 ఎకరాల పంట నష్టం వాటిల్లింది నష్టాన్ని అంచనా వేయాలని ఎఓ ఎన్ శ్రీనివాసరావు ఆదేశించారు. వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. పంట పొలాల్లో నీటి నిల్వలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రాంతాల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లేలా కాలువలు, నీటి మార్గాలను సరిచేయాలని అధికారులకు సూచించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, కోటబొమ్మాళి మార్కెట్ కమిటీ చైర్మన్ శేషగిరిరావు, ‌పినకాన అజయ్ కుమార్, కోల లవికుమార్,తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్