ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కంది కుంట వెంకట ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ప్రపంచ ప్రఖ్యాత తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఈ నెల 27న ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమానికి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.తిమ్మమ్మ మర్రిమాను అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించారని, గతంలో ఇచ్చిన మాట మేరకు తిమ్మమ్మ మర్రిమాను వద్ద బొటానికల్ గార్డెన్ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే గతంలో చెప్పిన మాట ప్రకారం ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ,లేపాక్షి,బట్రేపల్లి, యోగివేమన, పాలపాటి దీన్నే, హార్సిలీ హిల్స్ వంటి ప్రాంతాలను టెంపుల్ సర్క్యూట్ గా తీర్చిదిద్దుతామన్నారు. అదేవిధంగా రెక్కమను వద్ద నుండి తిమ్మమర్రిమను వరకు రోడ్డు పనులు సంబంధించి టెండర్ దశలో ఉన్నాయన్నారు.ఈనెల 27న నిర్వహించే కార్యక్రమానికి కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
.ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గంగయ్య నాయుడు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)