ప్రజాశక్తి - మధురవాడ (విశాఖపట్నం): ఇంటి ముందు క్రికెట్ ఆడుకుంటుండగా విద్యుత్ ట్రాన్స్‌ఫారం ఎర్త్ వైరు తగలడంతో విశాఖ నగరంలోని జివిఎంసి ఐదో వార్డు పరిధిలోని సాయిరామ్ కాలనీలో ఆరేళ్ల బాలుడు ఆదివారం మృతిచెందాడు. మృతుని కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా సంతకవిటి మండలం ఉప్పన్నదావలస గ్రామానికి చెందిన కురిటి నారాయణరావు స్థానికంగా ఓ అపార్టుమెంట్ వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. భార్య చిన్నమ్మడుతో కలిసి పదేళ్లుగా మధురవాడ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు కురిటి అఖిల్ ఆదివారం ఉదయం రోడ్డుపై క్రికెట్ ఆడుతూ కిందపడిన బంతిని తీసే క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్ ఎర్త్ వైరు తగిలి మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు.
విద్యుదాఘాతంతో బాలుడు మృతి
21 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 12:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)