మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అడవులు

18 ఆగస్టు, 2026

కవిత
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 03:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రకృతి వర ప్రసాదాలు

పశుపక్ష్యాదులకు నిలయాలు

పచ్చని చెట్లకు వేదికలు

ప్రాణవాయువు నిచ్చే ప్రాణదాతలు!


పక్షుల కిలకిల రావాలు

నెమళ్ల అద్భుత నాట్య విన్యాసాలు

పులుల గాండ్రింపులు

సింహాల గర్జనలు

జిత్తులమారి నక్క వినయాలు

చూపరులకు చక్కని వినోదాలు.


ఆకుపచ్చదనపు హరిత వనాలు

అడవులు అందించే అత్యద్భుత వరాలు!


పర్యావరణ పరిరక్షణకు కారకాలు

సుగంధ ద్రవ్యాల ఆవాసాలు

నదుల జన్మస్థలాలు

వాతావరణ సమతుల్యతకు కీలకాలు

చందనాది వృక్షజాతులకు పుట్టినిళ్లు

జనహితం కోరే అడవులు!


సహజ సంపదలు

నిస్వార్థ సమాజ సేవకులు

వాయువునిచ్చి ఆయువునిల్పే ఆపద్బాంధవులు

అందరి అక్కరకు వినియోగించే అడవులు!

డా. ఆళ్ళ నాగేశ్వరరావు (కమల శ్రీ),

తెనాలి/ఐర్లాండ్, 74166 38823.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్