గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వైఎస్‌ఆర్‌సిపి నేత అంబటిపై కేసు

1 గంట క్రితం

ambati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 12:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కాకినాడ : వైఎస్‌ఆర్‌సిపినేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులను ఆటంకం కలిగించినట్లు ఆయనపై కేసు నమోదు చేసినట్లు కిర్లంపూడి పోలీసులు గురువారం తెలిపారు. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి, అతని అనుచరులు పోలీసులను తోసేసినట్లు ఏఆర్ ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్లు కిర్లంపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తోసేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అంబటి రాంబాబు సహా మరికొందరిపై పలు సెక్షన్ల కింద కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్