గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా కామ్రేడ్ చిట్టూరి 16వ వర్ధంతి

1 గంట క్రితం

west godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆచంట : ప్రజల కోసం పనిచేసిన నాయకులు, ప్రజా ప్రతినిధులు వారి గుండెల్లో చిరస్థాయిగా  నిలిచిపోతారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్  అన్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం  వల్లూరులో మాజీ సర్పంచ్, కామ్రేడ్ చిట్టూరి రామకృష్ణ  16వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక సెంటర్లో ఆయన స్థూపం వద్ద  పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రామకృష్ణ సర్పంచ్‌గా గ్రామాన్నికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. వల్లూరు సొసైటీ అధ్యక్షులు తోట ఆదినారాయణ, మాజీ ఉపసర్పంచ్ మైలే ఏసురత్నం, కట్టుంగ సూర్యనారాయణ  మాట్లాడుతూ.. ఆయన హయాంలో వల్లూరులో జరిగిన అభివృద్ధి పనులు ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరువలేరని అన్నారు. ముందుగా ఆయన సూపంపై ఉన్న  సిపిఎం జెండాను  మండల కార్యదర్శి పి మోహన్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బొర్రా ధర్మారావు, తలుపురి బుల్లబ్బాయి, సిర్రా నరసింహమూర్తి, సిర్రా విగ్నేశ్వరుడు,  సుబ్బారావు, చిట్టూరి నాగరాజు, చిట్టూరి రాంబాబు, చిట్టూరి  శ్రీనివాస్, తాళం శ్రీనివాసరావు, గెద్దాడ సన్యాసిరావు, ఉమా, ఆరుమెల్లి సుబ్బారావు, ఏడిది వెంకట కృష్ణారావు తాతాజీ, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్