ప్రజాశక్తి - కడియం : మండలంలోని కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్లో కొత్త సభ్యత్వాల నమోదు ప్రక్రియను గురువారం ప్రారంభించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప తెలిపారు. అసోసియేషన్లో సభ్యత్వం పొందేందుకు ఆసక్తి కలిగిన నర్సరీ రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. సభ్యత్వ దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్, బ్యాంకు కరెంట్ ఖాతా ధృవీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. అలాగే "సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్, కడియం" పేరుతో రూ.7,500 విలువైన డీడీ కూడా తీసుకురావాలన్నారు. సభ్యత్వానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కార్యాలయాన్ని సంప్రదించాలని అధ్యక్షుడు రత్నం అయ్యప్ప కోరారు.
నర్సరీ అసోసియేషన్‌లో నూతన సభ్యత్వాల నమోదు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 16, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)