శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మొట్లపల్లి ధర్మపురి క్రాస్ వద్ద ఢీకొన్న బొలెరో–ఆటో .. ఇద్దరి పరిస్థితి విషమం

1 రోజు క్రితం

mottlupalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 12:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – బైరెడ్డిపల్లి : బైరెడ్డిపల్లి మండలంలోని మొట్లపల్లి–ధర్మపురి క్రాస్ వద్ద గురువారం బొలెరో వాహనం, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన తూర్పుగడ్డ గ్రామానికి చెందిన జయపాల్, ధర్మపురి గ్రామానికి చెందిన ఈశ్వరప్పలను స్థానికులు 108 అంబులెన్స్‌లో ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్