ప్రజాశక్తి-పులివెందుల టౌన్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తో సహా 70 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈనెల 1వ తేదీన అనుమతి లేకుండా ఆందోళన చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రఫిక్ అనే వ్యక్తి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 196/2026 లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రక్రియ లో టిడిపి నాయకులు ఏజెంటును కూర్చోనీయకుండా చేశారని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గంటకు పైగా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా ఆందోళన పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ సహా 70 మందిపై కేసు నమోదు
03 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026, 10:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)