మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశాప్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ భారత్‌

10 నిమిషాల క్రితం

saff-1.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 11:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఫైనల్లో పాకిస్తాన్‌పై 2-1తో గెలుపు

  • 10వ సారి టైటిల్‌ కైవసం

ఢాకా: శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ కైవసం చేసుకుంది. బాగబంధు నేషనల్‌ స్టేడియంలో మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారతజట్టు 2-1గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. తొలి అర్ధ భాగం ముగియడానికి ముందు పాకిస్తాన్‌ తొలి గోల్ సాధించింది. ఘాజీ కొట్టిన కర్లింగ్ షాట్‌తో పాకిస్తాన్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, రెండవ అర్ధభాగంలో భారత్ మరింత దూకుడుగా ఆడింది. జునైద్‌కు నేరుగా రెడ్ కార్డ్ చూపిన తర్వాత, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భట్, బ్లూ టైగర్స్ తరఫున స్కోరును సమం చేసే గోల్ సాధించాడు. ఆ తర్వాత ఆట మొత్తం భారత్ ఆధీనంలోనే సాగింది. చివరకు 88వ నిమిషంలో మండి హెడర్‌తో చేసిన గోల్‌తో భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై 3-2 తేడాతో విజయం సాధించిన 'బ్లూ టైగర్స్' ఫైనల్లోనూ అదేస్థాయి ప్రదర్శనను కనబర్చింది. దీంతో హ్యాట్రిక్ టైటిళ్లను భారత్‌ కైవసం చేసుకుంది. 2021, 2023, 2026లలో భారత్ వరుసగా టైటిల్‌ను గెలుచుకుని హ్యాట్రిక్‌ సాధించింది. శాఫ్‌ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఇలా వరుసగా మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్‌ నిలిచింది. దీంతో భారత్‌ 10వ సారి శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను చేజిక్కించుకొని రికార్డుల్లోకెక్కింది. పాకిస్థాన్ ఆటను అద్భుతంగా ప్రారంభించింది. భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ మందీ మాట్లాడుతూ.. ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలుపు గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపాడు. దేశం కోసం ఫైనల్ మ్యాచ్‌లో గోల్ చేయడం... నిజంగా అద్భుతమైన అనుభూతి అని పేర్కొన్నాడు. తొలి అర్ధభాగంలో వెనుకబడ్డ దశలో తనకు గోల్‌ చేసే సువర్ణావకాశం లభించిన క్షణం మరచిపోలేనిదని, అది పూర్తిగా జట్టు కృషితోనే సాధ్యమైందన్నాడు. భారతజట్టు సెమీఫైనల్లో 2-1తో భూటాన్‌పై విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మరోవైపు పాకిస్థాన్ గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లలో పుంజుకున్న పాక్ జట్టు సెమీఫైనల్స్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌ను 1-0 గోల్ తేడాతో ఓడించి చరిత్రలో తొలిసారి శాఫ్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకొచ్చింది. తొలిసారి తుది పోరుకు చేరుకున్న జోష్‌లో ఉన్న పాకిస్థాన్ జట్టు, ఈసారి భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్నా వారి ఎత్తులను భారత డిఫెండర్లు అద్భుతంగా నిలువరించారు. ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 30సార్లు తలపడగా.. భారత్‌ 17సార్లు గెలుపొందగా.. పాకిస్తాన్‌ కేవలం 4సార్లు మాత్రమే విజయం సాధించింది. మరో 9 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్