ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాయల్ మెహతా మృతికి చంద్రబాబు సంతాపం

1 గంట క్రితం

I want to be remembered as the leader who provided water: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 09:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నెట్‌వర్క్-18 సీనియర్ జర్నలిస్ట్ పాయల్ మెహతా అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. పాయల్ మెహతా నిజాయితీ, అంకితభావం కలిగిన జర్నలిస్టుగా పనిచేశారని, ఒక కథనం కోసం అదనపు శ్రమ పడేవారని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రౌండ్‌ రిపోర్టింగ్‌ కోసం ఆమె అనేకసార్లు ఎపికు వచ్చారని తెలిపారు.

పార్లమెంట్‌లో తాము కలిసినప్పుడల్లా ఆమె స్వయంగా వచ్చి తాజా అంశాలను తనతో పంచుకునేవారని గుర్తుచేశారు. పాయల్‌లోని ఉత్సాహం, జర్నలిజం పట్ల నిబద్ధత, అందరినీ పలకరించే ఆత్మీయ చిరునవ్వు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. పాయల్ మెహతా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నెట్‌వర్క్‌-18 సహచరులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. ఆమె అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్