ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారాలు-2026కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ తెలిపారు. నంది నాటక బహుమతులకు పద్య, పౌరాణిక, సాంఘిక, బాలల, కళాశాల, విశ్వవిద్యాలయ నాటికలు, నాటకరంగంపై రచించిన పుస్తకాల విభాగాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కందుకూరి పురస్కారాలకు నాటకరంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న పౌరణిక, సాంఘిక నాటక కళాకారులు, దర్శకులు,సాంకేతిక నిపుణులు, రచయితలు, నాటక సమాజాల వారు దరఖాస్తులు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో కందుకూరి రంగస్థల ప్రతిష్టాత్మక పురస్కారం, జిల్లా స్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలు అందజేయనున్నారని తెలిపారు. ఆసక్తిగల వారు అక్టోబర్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు ప్రింట్‌ను సంబంధిత పత్రాలు, రుజువులతో కలిపి అక్టోబర్ 26లోగా విజయవాడలోని సంస్థ కార్యాలయానికి అందజేయాలని కోరారు. వివరాలకు సంస్థ వెబ్‌సైట్ www.apsftvtdc.in ను చూడాలని సూచించారు.
నంది, కందుకూరి పురస్కారాలకు దరఖాస్తులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 09:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)