ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: గురజాడ స్మారకంగా విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కెఎస్ లక్ష్మణరావు, తవ్వా సురేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురజాడ జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కన్యాశుల్కం, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలను మహాకవి గురజాడ అప్పారావు తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు. కుల మతాల విభేదాలు వీడి అన్నదమ్ముల వలె అందరూ దేశాభివృద్ధికీ, సమాజ ప్రగతికి పాటుపడాలని గురజాడ ఆకాంక్షించారని, 'మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును' అని ప్రకటించిన సత్యశోధకుడు గురజాడ అని కొనియాడారు. గురజాడ జయంతి సందర్భంగా ఈనెల 21 నుంచి 28 వరకు ‘దేశభక్తి ప్రచార వారోత్సవాలు’ నిర్వహించి, పాఠశాలలు, విద్యాసంస్థలు, మండల, తాలూకా కేంద్రాల్లో గురజాడ రచించిన ‘దేశమును ప్రేమించుమన్నా’ గేయాన్ని ఆలపించాలని విజ్ఞప్తి చేశారు. గురజాడ ఆశయాలను భావితరాలకు స్ఫూర్తిగా అందించాలని కోరారు.
విజయనగరంలో సాంస్కృతిక వర్సిటీని నెలకొల్పాలి
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 10:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)