బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

22న కాకినాడలో జనసేన కీలక భేటీ

20 సెప్టెంబర్, 2026

jansena
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 09:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలపై జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 22న కాకినాడలో జరగనుంది. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సమావేశానికి పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌‌సిలు, కార్పోరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌లతో పాటు 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు నియమించిన స్థానిక సంస్థల సమన్వయకర్తలు, సమన్వయ కమిటీ సభ్యులు, సపోర్ట్‌ టీమ్‌ సభ్యులు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన సన్నాహాలు, కూటమి పక్షాల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్