విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపాలని విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మురసు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదం ఉందనే సూచనలను దృష్టిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయ్, డికె శివకుమార్‌తో సిఎం చంద్రబాబు ఆదివారం ఫోన్లో మాట్లాడారు. తుపాను నేపథ్యంలో విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బందిని, యంత్రాలను పంపాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. దీనిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి అవసరమైన మేరకు సహకరిస్తామని తెలిపారు. ఈ మేరకు అధికారులు ఇరు రాష్ట్రాలకు చెందిన శాఖాధికారులను సంప్రదిస్తారని సిఎం చంద్రబాబు వారితో చెప్పారు.







కామెంట్‌లు (0)