ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపారిపోతుంటే కాల్చేశారు!

1 గంట క్రితం

1001653123-1793554364330-8176.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 12:33 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆస్పత్రిలో ‘రాప్తాడు ఉన్మాది’

  • మాపై దాడి చేశాడు.. అందుకే కాల్చాం పోలీసులు

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై దాడికి పాల్పడిన ఉన్మాది హేమంత్‌‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలికపై విద్యుత్‌ ‌రంపంతో తీవ్రంగా దాడి చేసిన అనంతరం పారిపోయిన హేమంత్‌, అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు అడవుల్లో ఉన్నట్లు వారికి సమాచారం అందింది. దీంతో పోలీసులు బృందాలుగా అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని హెచ్చరించినా హేమంత్ పట్టించుకోలేదు. పోలుసులపై కి రాళ్లు విసురుతూ పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. దగ్గరకు వెళ్లిన సిఐ వెంకటేశ్‌ ‌పై కత్తితో దాడిచేశాడు. పదేపదే హెచ్చరించినా, వినకుండా దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం నిందితుడిపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. బుల్లెట్లు తగలడంతో హేమంత్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే పడిపోయాడు. నిందితుడిని పోలీసులు అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు.. ఈ ఘటన నేపథ్యలో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Screenshot from 2026-11-01 21-41-49.png

విషమంగానే విద్యార్థిని పరిస్థితి

రాప్తాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉన్మాది ఘాతుకంతో తీవ్రంగా గాయపడిన బాలిక పరిస్థితి ఆదివారం రాత్రి సమయానికి కూడా విషమంగానే ఉంది. రంపంతో కోయడంతో శరీరంలో లోతైన గాయాలయ్యా యని, వాటిని సరిచేయడానికి ఇప్పటి వరకు మణిపాల్‌ ‌వైద్యులు మూడు శస్ర్త చికిత్సలు చేసినట్టు సమాచారం. అయినా ఇంకా పరిస్థితి మెరుగుపడనట్టు తెలుస్తోంది.

ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం : లోకేష్‌

బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రాష్ర్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు తమీమ్‌ అన్సారియా ఆదివారం చూశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో లోకేశ్‌ ‌మాట్లాడారు. దాడి చాలా పాశవికంగా జరిగిందన్నారు. ఇటువంటి గాయాలు ఇంత వరకూ చూడలేదని, మరో 48 గంటలు కీలకమని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు. ప్రభుత్వపరంగా అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని బాలిక తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అంతకుముందు ఆ‌ర్‌‌జెడి శ్యాముల్‌, అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్‌ ‌హుస్సేన్‌‌, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ... బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్