శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చాలా క్లోజ్ .. బిజీ అయ్యాం.. గ్యాప్ వచ్చింది : చిరంజీవి

1 గంట క్రితం

We were very close... we got busy... a gap developed: Chiranjeevi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : తన మిత్రుడు జివి.నారాయణ రావు అంత్యక్రియలకు చిరంజీవి హాజరయ్యారు. ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన చిరంజీవి... వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. '' 1977 నుంచి మా ఇద్దరి మధ్య పరిచయం. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కలుసుకున్నాం. తను (GV Narayanarao) అప్పటికే సీనియర్‌ స్టూడెంట్. మేం ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు తన అనుభవాలు పంచుకునేవాడు. చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి వాళ్లం బిజీ అయ్యాం. నా సినిమాల్లోనూ ఆయన నటించారు. ఆ తర్వాత మా బాధ్యతల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చింది. యాదృచ్ఛికం ఏంటంటే.. పది రోజుల క్రితం కూడా ‘మంచుపల్లకి’ చూశాను. అందులో ఆయన కీలకపాత్రలో నటించారు. ఆ సినిమా స్ఫూర్తితో కొత్త కంటెంట్‌తో, ఐదుగురు కొత్త వాళ్లతో ఒక స్టోరీ రాశానని జివి చెప్పారు. నన్ను చూడాలన్నారు. దాని గురించి మాట్లాడిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఫొటో దిగాం. బహుశా ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో. చాలా మొండి మనిషి. ఏ విషయాన్నీ లెక్క చేయడు’’ అని తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

01

02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్