శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్టోబర్ 23న ‘అనంత’లో సిఐఐ-2026 రీజనల్ కాన్ఫరెన్స్

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 12:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-అనంతపురం : ​అనంతపురం జిల్లా కేంద్రంలోని జెఎన్‌‌టియులో అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎపి ఇడిబి) ఆధ్వర్యంలో సిఐఐ-2026 రీజనల్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఒ ఆనంద్‌‌తో కలిసి ఎపి ఇడిబి సిఇఒ సగిలి షణ్మోహన్‌ శనివారం పరిశీలించారు. జెఎన్‌‌టియులోని ఎన్‌‌టిఆర్ ఆడిటోరియంలో, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌, అతిథి గృహంలో ముందస్తుగా ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి డెలిగేట్స్, విఐపిల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని నిర్వహణ చర్యలనూ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస యాదవ్, ఎకనమిక్ డెవలప్‌‌మెంట్ బోర్డ్ మేనేజర్ అనంత్, ఎపిఐఎసి జెడ్ఎం నాగకుమార్, జెఎన్‌‌టియు వైస్‌ ‌ఛాన్సలర్‌ సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్