బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేటి నుంచి విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు..

19 నిమిషాల క్రితం

సర్వం సిద్ధం
 -నేటి నుంచి విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు
- రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం : ప్రభుత్వం
-విదేశీ ప్రతినిధులతో ‘డే 0’ సెషన్స్‌‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 01:27 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం : ప్రభుత్వం

  • విదేశీ ప్రతినిధులతో ‘డే 0’ సెషన్స్‌‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ ‌కాలేజీ గ్రౌండ్స్‌‌లో రెండు రోజుల పాటు జరగనున్న సిఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర షిప్పింగ్‌ ‌మంత్రి సర్బానంద్‌ ‌సోనోవాల్‌, ఇతర దేశాల పారిశ్రామిక ప్రతినిధులు, కేంద్ర, రాష్ర్ట రాజకీయ ప్రముఖులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు విశాఖకు బుధవారం రాత్రికే విచ్చేశారు. సదస్సుకు ముందు రోజు ‘డే 0’ సెషన్స్‌‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రెండు రోజుల సదస్సులో రూ.12,13,853.23 కోట్ల విలువైన ఎంఒయు కుదుర్చుకోనున్నట్లు, వీటిద్వారా 2,46,373 మందికి ఉపాధి కల్పన కలగనున్నట్లు రాష్ర్ట ప్రభుత్వం వెల్లడించింది. దీంట్లో కియా సంస్థతో రెండు ప్రత్యేక ఎంఒయులు ఉన్నట్లు తెలిపింది. గురువారం ఉదయం ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ ‌గోయల్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు పాల్గొననున్నారు. 13న ముగింపు సభకు ఉప రాష్ర్టపతి రాథాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. రాష్ర్ట గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ ‌నజీర్‌, కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి, కేంద్ర ఓడరేవులు షిప్పింగ్‌ ‌మంత్రి శర్బానంద్‌ ‌సోనోవాల్‌, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి చిరాగ్‌ ‌పాశ్వాన్‌, రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ నితిన్‌ ‌గడ్కరీ హాజరు కానున్నారు. వీరు వివిధ సెషన్స్‌‌కు నేతృత్వం వహించనున్నారు. యుఎఇ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ ‌తౌక్‌ ఆల్‌ ‌మర్రి, స్లోవాక్‌ ‌రిపబ్లిక్‌ ఆర్థిక మంత్రి లాడిస్లావ్‌ ‌కామెనిట్స్‌‌కీ, సింగపూర్‌ ‌విదేశీ వ్యవహారాల మంత్రి, ఇంధన శాఖ సహాయ మంత్రి గాన్‌ ‌సియూ హ్వాంగ్‌, కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మనింధర్ సిద్దూ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. నేపాల్‌, మారిషస్‌, గ్వాటెమాలా, కంబోడియా, మయన్మార్‌, టాంజానియా, దేశాల మంత్రులు రానున్నారు. ప్రపంచ మేథో సంపతి సంస్థ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌డారెన్‌ ‌టాంగ్‌ ‌సదస్సులో పాల్గోనున్నారు.

ఎపిలో పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు ఆసక్తి : జపాన్ రాయబారి కెయిచీ ఓనో

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని భారత్‌లో జపాన్ రాయబారి కెయిచీ ఓనో వెల్లడించారు. రాష్ట్రంలో జపాన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ఆయన... ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాల సరఫరా, గ్రీన్ ఎనర్జీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు... జపాన్ రాయబారికి వివరించారు. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్, భారీ యంత్రాల తయారీ సంస్థలైన సుజుకి, హోండా, కోమాట్సు, కవాసాకి, యమహా తదితర కంపెనీలు తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. షిప్ బిల్డింగ్ క్లస్టర్‌లో మిత్సుబిషి, కవాసాకి హెవీ ఇండస్ట్రీస్, ఇమాబారి వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఈ ఏడాది విశాఖపట్నంలో కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి) ప్రారంభించినట్లు జపాన్ ప్రతినిధులు తెలిపారు. ఐదేళ్ల పాటు ఏటా సుమారు 70 వేల టన్నుల గ్రీన్ అమ్మోనియా కొనుగోలుకు జపాన్‌కు చెందిన జెరా సంస్థ, ఎఎం గ్రీన్‌తో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఎపిలో అపారమైన అవకాశాలు : యుఎఇ మంత్రితో భేటీలో సిఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని దుబాయ్-యుఎఇలకు చెందిన వివిధ ప్రముఖ కంపెనీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన యుఎఇ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ఆయన భేటీ అయ్యారు. రాయలసీమ నుంచి పండ్లు ఇప్పటికే విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని, లక్ష కోట్ల రూపాయలతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా యుఎఇ మంత్రి అబ్దుల్లా బిన్ అల్ తౌక్ మర్రి మాట్లాడుతూ ఎపిలో ఫుడ్ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు యుఎఇకి చెందిన మరో 12 కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వివరించారు. ఎపిలో నూతనంగా నిర్మించిన భోగాపురం విమానాశ్రయం అద్భుతంగా ఉందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్