శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అధునాతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సిఎం చంద్రబాబు

11 గంటల క్రితం

CM Chandrababu launches state-of-the-art fire-fighting vehicles.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 11:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి లో అధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రారంభించారు. నేడు సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. రూ.40 కోట్ల వ్యయంతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను సిఎం జెండా ఊపి ప్రారంభించారు. 25 ఫైర్ ఫైటింగ్, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలను వినియోగించనున్నారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. భారీ అగ్నిప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్‌ బౌజర్లు కొనుగోలు చేసింది. ఇరుకైన, రద్దీ ప్రాంతాల్లోకి వేగంగా చేరుకునేలా 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు పనిచేస్తాయి. తొలి దశలో ఇప్పటికే రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వాహనాల ప్రత్యేకతలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్