- నేటినుంచి శ్రీలంకతో తొలి టెస్ట్
- ఉ. 9.00గం.ల నుంచి
గాలే: భారత్-శ్రీలంక జట్ల మధ్య గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. జస్ప్రీత్ బుమ్రా లేకున్నా.. పేస్ బౌలింగ్ యూనిట్ పై పూర్తి నమ్మకం ఉందని, గుర్నూర్ బ్రార్ మంచి పేస్ తో పాత బంతిని బౌన్స్ చేయగలడని తెలిపాడు. బుమ్రా లేకపోవడం ఇతర పేసర్లకు తమ సత్తా చాటుకునేందుకు ఒక మంచి అవకాశం. తొలి రెండు రోజుల్లో వికెట్ నుంచి ఎక్కువ సపోర్ట్ లేకపోయినా ఫీల్డింగ్ వ్యూహాలతో ఒత్తిడి పెంచి వికెట్లు తీయాలి" అని పేర్కొన్నాడు. ఇక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో రాణించాడు. కాబట్టి మిడిలార్డర్‌లో జట్టు బాధ్యతలను అతడు మోయగలడని వివరించాడు.
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, పంత్(వికెట్ కీపర్), జురెల్, జడేజా, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, కుల్‌దీప్, సిరాజ్. శ్రీలంక: ధనుంజయ(కెప్టెన్), డిక్వెల్లా(వికెట్ కీపర్), మధుశంక, లాహిరు, ఛండీమాల్, కమిందు, సూర్యభండార, రమేశ్ మెండీస్, ప్రభాత్ జయసూరియ, ఫెర్నాండో, మధుశంక/లాహిరు కుమార.








కామెంట్‌లు (0)