న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్ సంస్థ రాపిడో అంతర్జాతీయ రైడ్ హెయిలింగ్ దిగ్గజం ఉబర్, కలిసి దేశంలో తమ వ్యాపారాలను విలీనం చేసేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే విలీనం తర్వాత యాజమాన్య హక్కులు, కార్యకలాపాల నిర్వహణ విషయంలో ఇరు సంస్థల మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ మెగా డీల్ కార్యరూపం దాల్చకుండానే నిలిచిపోయింది. గత మే నెలలో ఉబర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) దారా ఖోస్రోషాహి ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటించిన సమయంలో ఈ చర్చల ప్రక్రియ నడిచింది. దేశంలో తమ వ్యాపార విస్తరణ, కొత్త పెట్టుబడులపై వరుస సమీక్షలు నిర్వహించిన ఆయన, రాపిడో ముందు ఓ కీలక ప్రతిపాదన ఉంచారు. క్యాబ్, ఆటో, బైక్ టాక్సీ సేవలందిస్తున్న ఉబర్, రాపిడోలు తమ భారతీయ వ్యాపారాలను విలీనం చేసి, ఆ ఉమ్మడి కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలను రాపిడో బృందానికే అప్పగించాలని ఉబర్ భావించింది. అయితే ఉబర్ ప్రతిపాదనకు భిన్నంగా రాపిడో మరో ప్లాన్ ముందుకు తెచ్చింది. భారత్‌లోని ఉబర్ వ్యాపారాన్ని పూర్తిగా ‘క్యాష్ అండ్ స్టాక్’ లావాదేవీ రూపంలో తమకు విక్రయించాలని, తద్వారా రాపిడో సంస్థలోనే ఉబర్ ఒక మైనారిటీ వాటాదారుగా కొనసాగాలని ప్రతిపాదించింది. భారత మార్కెట్‌పై పూర్తి పట్టు కోల్పోవడం ఇష్టం లేని ఉబర్ ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
ఉబర్-రాపిడో విలీనంపై చర్చలు..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 11:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)