శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మరోసారి టాటా కార్ల ధరల పెంపు..?

2 గంటల క్రితం

tata
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 09:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ముడిసరుకుల భారం ఎఫెక్ట్‌

‌ముంబయి : పెరుగుతున్న స్టీల్, అల్యూమినియం తదితర ముడిసరుకుల వ్యయ భారం, మార్జిన్లపై ఒత్తిడి కారణంగా విడతల వారీగా ప్యాసింజర్ వాహనాల ధరలను మళ్లీ పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్‌ ‌వెహికల్స్‌ (‌టిఎంపివి) సంకేతాలు ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాల సందర్భంగా ఆ కంపెనీ సిఎఫ్‌ఒ ధీమన్ గుప్తా మాట్లాడుతూ.. మార్జిన్లను కాపాడుకుంటూనే, కస్టమర్లపై ఒకేసారి భారం పడకుండా ఏడాది పొడవునా క్రమానుగత ధరల పెంపుతో పాటు ఖర్చుల తగ్గింపు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా, 2026లో ఇప్పటికే ఏప్రిల్‌లో 0.5 శాతం, జూలైలో 1.5 శాతం వరకు రెండు సార్లు ధరలను సవరించిన టాటా మోటార్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకంగా 46 శాతం వృద్ధితో 1,82,574 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి బలమైన డిమాండ్‌ను కొనసాగిస్తోన్నట్లు పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్