శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభారీ వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష

31 నిమిషాల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నతాధికారులతో శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటలు నీటమునగడం, ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలపై సీఎస్‌ సాయిప్రసాద్‌తో పాటు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు వివరించారు. ఆయా జిల్లాల్లో రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలను ఇరిగేషన్‌ అధికారులు వివరించారు.

హీర మండలం లిఫ్ట్‌ ప్రాజెక్టుకు విద్యుత్‌ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖల ఉన్నతాధికారులు తక్షణమే ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లిఫ్ట్‌ పనులను పూర్తి చేసి వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్‌లోకి తరలించాలని ఆదేశించారు. పలు జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకుంటున్న చర్యలపై కూడా అధికారులతో చర్చించారు.

కృష్ణానదిలో ఎగువ నుంచి ప్రస్తుతం పెద్దగా ప్రవాహాలు లేవని, స్థానికంగా వస్తున్న వరద నీటితోనే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ స్థానిక వరద నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరో బ్యారేజీ నిర్మాణం అవసరమని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని, ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.

తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం వర్షాలు పూర్తిగా తగ్గాయని, అయితే ఉత్తరాంధ్రలో ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్