శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒకే ఇంట్లో ఇద్దరు మహిళల హత్య

10 నిమిషాల క్రితం

hatya.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నదమ్ముల ఘాతుకం

ప్రజాశక్తి-సంతమాగులూరు : ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన గొడవల నేపథ్యంలో అన్నదమ్ములు వసంత రాయుడు, అనిల్‌ విచక్షణ కోల్పోయి కన్నతల్లి, కట్టుకున్న భార్యపై కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను వీరనారాయణమ్మ (30), బ్రహ్మేశ్వరమ్మ (50)గా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంతమాగులూరు సీఐ శేషగిరిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్