శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మైదుకూరులో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌

7 నిమిషాల క్రితం

police.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 08:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రికార్డులు లేని 23 వాహనాలు స్వాధీనం

ప్రజాశక్తి - మైదుకూరు: రానున్న ఎన్నికల నేపథ్యంలో మైదుకూరు పట్టణంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున కొత్తకొట్టాలు, గాంధీనగర్‌, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన రికార్డులు, పత్రాలు లేని 23 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులు, అనుమానితుల ఇళ్లతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వేటకొడవళ్లు, బాంబులు, నిషేధిత ఆయుధాల కోసం విస్తృతంగా గాలించారు. వాహనాల రికార్డులను పరిశీలించి సరైన పత్రాలు లేని 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సీఐ రమణారెడ్డి మాట్లాడుతూ తక్కువ ధరకు లభిస్తున్నాయనే ఆశతో సరైన రికార్డులు లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. అలాంటి వాహనాలను కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రౌడీషీటర్లు, ట్రబుల్‌ మాంగర్లు, సస్పెక్ట్‌ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి గొడవలకు పాల్పడకుండా ప్రశాంతంగా జీవించాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా, అనుమానిత వ్యక్తులు కనిపించినా వెంటనే డయల్‌ 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు చిరంజీవి, వెంకటరమణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్