వాషింగ్టన్: హర్మూజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునరుద్ధరించేందుకు ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించే అవకాశం ఉందని ట్రంప్ తన సహచరులతో చెప్పినట్లు ఆ కథనం వెల్లడించింది. అయితే, ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా అధికారికంగా స్పందించిందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
ఖతార్ ద్వారా అమెరికాకు ఒక నిర్దిష్ఠ ప్రణాళికను పంపినట్లు ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వెల్లడించారు. ఈ ప్రతిపాదన ప్రకారం.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన నావికాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, చమురు ఆంక్షలను సడలించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులకు అంగీకరిస్తే.. ఏడు రోజుల్లో హర్మూజ్ జలసంధిని తెరిచి, లెబనాన్‌తో సహా అన్ని ప్రాంతాల్లో ఘర్షణలను నిలిపివేస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. దీని తర్వాత అణు కార్యక్రమంపై విస్తృత చర్చలకు సిద్ధమని పేర్కొంది. అయితే, ఇరాన్ తన డిమాండ్లను నెరవేరుస్తుందనే నమ్మకం లేదని ట్రంప్ భావిస్తున్నట్లు 'వాల్ స్ట్రీట్' జర్నల్ కథనం పేర్కొంది. ఇరాన్‌ను అణుబాంబును సొంతం చేసుకోనివ్వనని శపథం చేసిన ఆయన, ఎన్నికల తర్వాత దాడులే సరైన మార్గమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధిని 'ట్రంప్ స్ట్రెయిట్' అని లేబుల్ చేసిన చిత్రాన్ని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పంచుకోవడం గమనార్హం.
ఇరాన్ 7 రోజుల శాంతి ప్రతిపాదన.. ట్రంప్ తిరస్కరణ..!
7 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)