ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘సింగీతం’ మృతి పట్ల సిఎం, డిప్యూటీ సిఎం, జగన్‌ సంతాపం

04 అక్టోబర్, 2026

tasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 08:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన సినీ పరిశ్రమకు దిక్సూచిగా మారారని తెలిపారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగీతం భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

డిప్యూటీ సిఎం పవన్‌ ‌విచారం

సింగీతం శ్రీనివాసరావు కన్ను మూశారని తెలిసి విచారిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ‌తెలిపారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకి విభిన్న చిత్రాలు అందించిన దర్శకుడని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369, మైకేల్ మదన కామరాజు లాంటి చిత్రాల్లో శ్రీనివాసరావు చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయన్నారు. ఆయన రూపొందించిన అమెరికా అమ్మాయి, పంతులమ్మ లాంటి చిత్రాల్లోని గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు.

చలనచిత్ర రంగానికి మార్గదర్శి : వైఎస్ జగన్‌

సింగీతం శ్రీనివాసరావు మృతితో భారతీయ చలనచిత్ర రంగం ఓ గొప్ప మార్గదర్శిని, వినూత్న దర్శకుడిని కోల్పోయిందని వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ ‌పేర్కొన్నారు. 94 ఏళ్ల వయసులోనూ సినిమాలు రూపొందించి సినీ రంగానికి సేవలందించిన శ్రీనివాసరావు మరణం ఎంతో బాధాకరమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మౌన చిత్రాల నుంచి వైజ్ఞానిక కల్పిత కథా చిత్రాల వరకు ఆయన ప్రదర్శించిన అసమాన సృజనాత్మకత, ప్రయోగాత్మక దృక్పథం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ఆత్మీయులకు సానుభూతిని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్