ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించవలసిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కమిషనర్ రాహుల్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 2 వరకు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసే వరకు పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
ఎన్నికల కోడ్ ముగిసే వరకు పీజీఆర్ఎస్ రద్దు : కమిషనర్ రాహుల్ మీనా
48 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 04:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)