బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడు తిరుమలకు సిఎం

-155 నిమిషాల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 01:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • చంద్రబాబు సమక్షంలో టిటిడికి 121 కిలోల ఆభరణాలు సమర్పించనున్న భక్తుడు

ప్రజాశక్తి- తిరుపతి టౌన్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తిరుమలకు రానున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి 121 కిలోల బంగారు ఆభరణాలను ఓ భక్తుడు సమర్పించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. గురువారం ఉదయం అమరావతి నుంచి బయలుదేరి ఉదయం పది గంటలకు తిరుపతిలోని ఎస్‌వి వ్యవసాయ కళాశాల హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించి ఉదయం 10.45 గంటలకు తిరుమల గాయత్రీ నిలయానికి వస్తారు. 11.10 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం ఉదయం 11.35 గంటలకు స్వామివారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత తిరుపతి నుంచి తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగుడేనికి సిఎం చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్