మార్చ్ టు ఢిల్లీ జయప్రదానికి ప్రచార ర్యాలీలు
ప్రజాశక్తి - యంత్రాంగం : నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిసెంబర్ ఒకటి నుంచి మూడు వరకూ నిర్వహించనున్న మార్చ్ టు ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గుంటూరు, చిత్తూరులో పోస్టర్లు ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ర్యాలీలు చేపట్టారు.
విశాఖపట్నం మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో మల్కాపురం నుంచి శ్రీహరిపురం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబరు కోడ్స్ చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ ఆపాలని నినాదాలు చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో ఎపి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షులు సిహెచ్.కుమార్ మాట్లాడుతూ.. మార్చ్ టు ఢిల్లీ కార్యక్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల ఉద్యోగ భద్రత, వేతనాలు, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల హక్కులను చట్టబద్ధంగా పరిరక్షించాలని,వారికి నిర్దిష్టమైన పని విధానాన్ని రూపొందించాలని, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ విధానాన్ని సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు వర్తింపజేయకూడదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం కేవలం నిరసన మాత్రమే కాదని,కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రత, వ్యక్తిగత గోప్యత, భవిష్యత్తు పరిరక్షణ కోసం సాగిస్తున్న పోరాటమని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా విద్యుత్ స్టోర్ దగ్గర హమాలీలతో కలిసి చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.







కామెంట్‌లు (0)