బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionRSA vs BAN, 2nd Test : దక్ష‍ిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌

25 నిమిషాల క్రితం

RSA vs BAN, 2nd Test
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 10:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రెండో టెస్ట్‌లో బంగ్లాపై ఇన్నింగ్స్‌

  • 219 పరుగులతో గెలుపు

సెంచూరియన్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య దక్ష‍ిణాఫ్రికా జట్టు 2-0తో చేజిక్కించుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి టెస్ట్‌లో 9వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుచేసిన సఫారీలు.. రెండో టెస్ట్‌లో ఏకంగా ఇన్నింగ్స్‌ 219 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 7వికెట్ల నష్టానికి 494 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసిన దక్ష‍ిణాఫ్రికా.. నాల్గోరోజైన గురువారం బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులకు ఆలౌట్‌ చేసింది. తౌహిద్‌ హృదయ్‌(41), మొహిఫుల్‌ ఇస్లామ్‌(38), కెప్టెన్‌ నజ్ముల్‌(34), తంజిద్‌ హసన్‌(29) బ్యాటింగ్‌లో రాణించారు. మోమినుల్‌(0)డకౌట్‌ కాగా.. జాకెర్‌ అలీ(2), షోరిఫుల్‌(0) నిరాశపరిచారు. దక్ష‍ిణాఫ్రికా బౌలర్‌ ముల్డర్‌కు ఏడు వికెట్లు లభించగా.. యాన్సెన్‌కు రెండు, రబడాకు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ముల్డర్‌కు, సిరీస్‌ ఆకెర్మన్‌కు లభించాయి. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ డిసెంబర్‌ 1నుంచి ప్రారంభం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్