బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​ప్రీ క్వార్టర్స్‌కు అస్మిత, ఉన్నతి, తాన్వీ

27 నిమిషాల క్రితం

సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 10:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

న్యూఢిల్లీ: సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌ గేమ్‌లో అస్మిత చాలీహాతోపాటు ఉన్నతి హుడా, తాన్వీ శర్మ ప్రత్యర్ధులను చిత్తుచేసి ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. రౌండ్‌-32లో 5వ ర్యాంకర్‌ అస్మిత 21-14, 21-16తో ఉక్రెయిన్‌కు చెందిన పోలినిని చిత్తుచేయగా.. 3వ ర్యాంకర్‌ ఉన్నతి 21-15, 21-19తో ఉక్రెయిన్‌కే చెందిన యెవనియాను ఓడించారు. ఇక తాన్వీ శర్మ 1-2తో వెనుకబడి ఉన్న దశలో మలేషియాకు చెందిన జో-జిన్‌-వుయ్‌ గాయం కారణంగా టోర్నీనుంచి నిష్క్రమించింది. తస్మిన్‌ మీర్‌ 21-17, 21-12తో మాల్విక బన్సోద్‌ను చిత్తుచేసి ప్రీ క్వార్టర్స్‌కు చేరారు. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ రాయ్‌, సుబ్రమణియన్‌ అనూహ్యంగా తొలిరౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. తొలిరౌండ్‌లో సుబ్రమణియన్‌ 17-21, 12-21తో మలేషియాకు చెందిన 2వ ర్యాంకర్‌ లీ-జి-జియా చేతిలో, ప్రణయ్‌ రాయ్‌ 19-21, 17-21తో జి-వింగ్‌ యు(చైనీస్‌ తైపీ) చేతిలో వరుససెట్లలో పరాజయం పాలయ్యారు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టాప్‌సీడ్‌ ధృవ్‌ కపిల-తానీసా కాస్ట్రో జంట 16-21, 21-16, 21-16తో భారత్‌కే చెందిన అరోరా-వాల్కెర్‌ను ఓడించారు. ఇక మహిళల డబుల్స్‌లో టాప్‌సీడ్‌ త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్‌ జంట 21-17, 23-21తో భారత్‌కే చెందిన రుతిపర్ణ-శ్వేతపర్ణను ఓడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్