బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం..

52 నిమిషాల క్రితం

atchennaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాకినాడ జిల్లా ఉప్పాడలోని సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశామని మంత్రి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారి ఆచూకీ గుర్తించేందుకు అవసరమైన సహకారం కోరడంతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల సముద్ర జలాల వైపు వెళ్లి ఉండే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కేంద్ర విదేశాంగశాఖ ద్వారా ఆయా దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారత తీర రక్షక దళం, నౌకాదళం, ఒడిశా అధికారులు, రాష్ట్ర మత్స్యశాఖ సమన్వయంతో గాలింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. మరోవైపు కాకినాడ జిల్లా యేటిమొగ నుంచి చేపల వేటకు వెళ్లి ఇంజిన్ వైఫల్యంతో సముద్రంలో నిలిచిపోయిన బోటు సురక్షితంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకోవడంపై మంత్రి అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. డ్రైవర్‌తో సహా ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడం వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటనిచ్చిందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్