బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionన్యూజిలాండ్‌ పేసర్‌ టిక్నర్‌కు గాయం

30 నిమిషాల క్రితం

న్యూజిలాండ్‌ పేసర్‌ టిక్నర్‌కు గాయం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 10:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

క్రైస్ట్‌చర్చ్‌ : భారత్‌తో రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పేసర్‌ బ్లెయిర్‌ టిక్నర్‌ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో కుడి తొడ కండరానికి గాయం కావడంతో అతడిని జట్టునుంచి తప్పించినట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. టిక్నర్‌ స్థానంలో మాట్‌ ఫిషర్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ డ్రా అయిన సంగతి తెలిసిందే. భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య 27నుంచి క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా రెండో, చివరి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఆ టెస్టులో గెలిచిన జట్టుకు ట్రోఫీ దక్కనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్