సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పట్టణాల్లో కోడ్‌ ఎత్తివేత..

13 నిమిషాల క్రితం

sec
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. నవంబరు 7వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ప్రకటించారు. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీరాల మున్సిపాలిటీలో తుపాను కారణంగా వాయిదా పడిన ఓట్ల లెక్కింపు ఈనెల 6న పూర్తయింది. దీంతో మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్‌, ఛైర్‌పర్సన్‌, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ ముగిసింది.గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ కొనసాగనుంది. ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇంకా ముగియకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్