- సమగ్ర శిక్ష ఎస్పిడి బి. శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రతి అధికారి క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని, లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో అన్ని జిల్లాల అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆఫీసర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థ సక్రమంగా సాగించేందుకు కార్యక్రమాల నిర్వహణలో సమన్వయం అత్యంత కీలకమైనదని, ఎపిసిలు, డిఇఒలు, ఇతర శాఖల అధికారులతో, తోటి సిబ్బందితో స్నేహపూర్వక వాతావరణంలో సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయి అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించాలని, అన్ని పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, పనులను వేగవంతం చేయాలన్నారు. విధుల్లో అలసత్వం, జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీమ్యాట్ డైరెక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్, ఎఎస్సిడి కె.రవీంద్రనాథ్ రెడ్డి, కెజిబివి సెక్రటరి డి.దేవానందరెడ్డి, ఫైనాన్స్ కంట్రోలర్ బి.రాజగోపాలరావు, సీఈ ఎస్.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)