- జనసేన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన విధి విధానాలు రూపకల్పనకి ప్రత్యేక కమిటీని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో 14 మంది సభ్యులను నియమించారు. విధి విధానాలతోపాటు క్షేత్ర స్థాయిలో శ్రేణుల ఆలోచనలను ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలి బుద్ధ ప్రసాద్, టి.శివ శంకర్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, సీహెచ్ వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, పత్సమట్ల ధర్మరాజు, చిలకం మధుసూదన్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు (చినబాబు), సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కొరికాన రవి కుమార్లను ఈ కమిటీలో నియమించారు.








కామెంట్‌లు (0)