ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కమ్యూనిస్ట్ అభిమాని జిసి లక్ష్మిరెడ్డి మృతి

2 గంటల క్రితం

lakshmi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నివాళులర్పించిన సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - నంద్యాల : ప్రముఖ అభ్యుదయ వాది, కమ్యూనిస్ట్ అభిమాని శ్రీ లక్ష్మి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత జిసి లక్ష్మిరెడ్డి(88) అనారోగ్యంతో ఆదివారం ఉదయం ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్, సీనియర్ నాయకులు తోట మద్దులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.నాగరాజు, టి.రామచంద్రుడు, పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్, కార్యదర్శివర్గ సభ్యులు పుల్లా నరసింహ, సిఐటియు పట్టణ అధ్యక్షులు కెఎండి గౌస్, నాయకులు రాజు తదితరులు ఇంటి దగ్గర ఉన్న ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టి.రమేష్ కుమార్ మాట్లాడుతూ లక్షి రెడ్డి ఉపాధ్యాయ ఉద్యమానికి, అనంతపురం, కర్నూలు జిల్లాలో యుటిఎఫ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. విద్యార్థి ఉద్యమానికి సహాయ సహకారాలు అందించేవారని గుర్తుచేశారు. అనంతరం నంద్యాలలో కుటుంబసభ్యులు అంతక్రియలు నిర్వహించారు. లక్ష్మి రెడ్డి మృతికి సుందరయ్య విజ్ఞాన కేంద్రం పూర్వమేనేజింగ్ ట్రస్ట్ సి.సాంబిరెడ్డి సంతాపం తెలిపారు. తమ సోదరి సుమతి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

జిసి లక్ష్మీరెడ్డి మృతికి సిపిఎం సంతాపం

జిసి లక్ష్మీరెడ్డి మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మించారని పేర్కొన్నారు. యుటిఎఫ్‌ ‌నిర్మాత అని, అభ్యుదయ భావాలకు అండదండలిచ్చారని తెలిపారు. విద్యార్థి ఉద్యమానికి సహాయ సహకారాలను అందించారన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ గల విద్యను నేర్పించిన ఆదర్శభావాలు గల లక్ష్మీరెడ్డికి జోహార్లు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్