దక్షిణ అమెరికా దేశమైన పెరూలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నాజ్కా లైన్స్ సమీపంలో శనివారం కూలిపోయిన పర్యాటక విమానంలో ఇద్దరు పైలట్లతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పిస్కో విమానాశ్రయం నుంచి నాజ్కా లైన్స్‌ను వీక్షించేందుకు బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయి కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు ముందు రోజు బలమైన ఈదురుగాలులు, దుమ్ము కారణంగా ఆ ప్రాంతంలో పర్యాటక విమాన సర్వీసులను నిలిపివేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
పెరూలో ఘోర విమాన ప్రమాదం.. 13 మంది మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 09:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)