సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటిటిడి ట్రస్ట్ పదవీకాలం ముగింపు

2 గంటల క్రితం

TTD-Logo.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 09:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం

ప్రజాశక్తి- తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంట్రస్ట్ బోర్డు పదవీకాలం ముగిసింది. ఈ మేరకు టిటిడికి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం జిఒ నంబర్ 658 జారీ చేసింది. ఈ అథారిటీ చైర్మన్‌గా టిటిడి ఇఒ ముద్దాడ రవిచంద్రను నియమించింది. సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్, దేవదాయ శాఖ కార్యదర్శి కె కన్నబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే వరకు లేదా ఏడాది పాటు ఈ అథారిటీ కొనసాగనుంది. టిటిడి ధర్మకర్తల మండలికి ఉండే అన్ని అధికారాలు, విధులు దీనికి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా టిటిడి బోర్డు పదవీకాలం ముగిసిన వెంటనే నూతన పాలకమండలిని ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పాలకమండలి నియామకానికి ఆటంకం ఏర్పడింది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వామివారి కైంకర్యాలు, యాత్రికుల సౌకర్యాలు, దేవస్థానం నిత్యపాలన, రథసప్తమి వంటి కీలక ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంది. ఈ మేరకు టిటిడి పాలన కోసం స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని నిర్ణయించింది. ఐఎఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ప్రభుత్వం జిఒ జారీ చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్