ప్రజాశక్తి - పెందుర్తి : ఒక చోట వేయాల్సిన ఓటును మరో చోట వేసి, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన విశాఖ జిల్లా పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుపై సిపిఎం 115వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బలివాడ వెంకటరావు సోమవారం పెందుర్తి పోలీస్ స్టేషన్‌లోనూ, ఆర్‌ఒకు ఫిర్యాదు చేశారు. రమేష్ బాబుకు జివిఎంసి 117 వార్డులో ఓటు ఉండగా 115వ వార్డు 8వ బూత్‌లో ఓటు వేశారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. బొగ్గు నారాయణమ్మ ఓటును ఎమ్మెల్యే వేయడం వల్ల అది దొంగ ఓటు కిందకే వస్తుందని తెలిపారు. ఈ విషయంపై తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి జగన్ ఉన్నారు. చట్ట విరుద్ధంగా ఓటు వేసిన పెందుర్తి ఎమ్మెల్యేపై, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్యతగల శాసనసభ్యునిగా ఉండి ఈ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడడం క్షంతవ్యం కాదన్నారు.
ఎమ్మెల్యే ఓటుపై సిపిఎం ఫిర్యాదు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 10:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)