సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరైజింగ్‌ స్టార్స్‌ ఆసియాకప్‌ కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

2 గంటల క్రితం

Tilak's explosive knock... South Zone in the final.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 10:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దోహా వేదికగా జరిగే రైజింగ్‌ స్టార్స్‌ ఆసియాకప్‌కు జట్టును భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బిసిసిఐ) ప్రకటించింది. బిసిసిఐ ప్రకటించిన 15మంది ఆటగాళ్ల బృందానికి హైదరాబాద్‌ టి20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీతోపాటు గాయపడ్డ హర్షిత్‌ రాణా, రింకు సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌లకు చోటు లభించింది. భారత్‌-ఎ జట్టుకు గ్రూప్‌-బిలో చోటు లభించగా.. ఇదే గ్రూప్‌లో పాకిస్తాన్‌-ఎ, యుఎఇ-ఎ, నేపాల్‌-ఎ జట్లు ఉన్నాయి. ఈనెల 19నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా.. 20న నేపాల్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్‌ తన పోరాటాన్ని ప్రారంభించనుంది. 22న పాకిస్తాన్‌, 24న యుఎఇతో భారత్‌ తలపడనుంది. ఇక గ్రూప్‌-ఎలో బంగ్లాదేశ్‌-ఎ, శ్రీలంక-ఎ, ఆఫ్ఘనిస్తాన్-ఎ, హాంకాంగ్‌(చైనా) జట్లు ఉన్నాయి. గ్రూప్‌ దశ లీగ్‌ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం టాప్‌-2జట్లు సెమీస్‌కు చేరనున్నాయి. 26, 27న సెమీఫైనల్స్‌, 29న ఫైనల్‌ జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో గత ఎడిషన్‌లో భారతజట్టు సెమీస్‌లో సూపర్‌ ఓవర్‌లో బంగ్లాదేశ్-ఎ చేతిలో ఓటమిపాలైంది.

జట్టు: తిలక్‌ వర్మ(కెప్టెన్‌), గైక్వాడ్‌(వైస్‌ కెప్టెన్‌), కుమార్‌ కుషగ్ర, ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌(వికెట్‌ కీపర్లు), అభిషేక్‌, సూర్యవంవీ, రింకు సింగ్‌, సుయాంశ్‌ షెడ్జే, షాబాజ్‌ అహ్మద్‌, విప్‌రాజ్‌ నిగమ్‌, హర్ష్‌ దూబే, తరుణ్‌ కోటియన్‌, హర్షిత్‌ రాణా, ప్రిన్స్‌ యాదవ్‌, ఆర్షాద్‌ ఖాన్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్