నెల్లూరు: డీసీసీబీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని రెండోసారి అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్ర జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సత్యనారాయణరెడ్డిని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుతో విచ్చలవిడిగా, అరాచకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సత్యనారాయణరెడ్డి తన పొలంలో బాట వేసుకుంటుండగా కొందరు అడ్డుపడి దుర్భాషలాడుతూ దాడికి దిగారని తెలిపారు. అనంతరం ఓ వ్యక్తి అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందగా, ఆ ఘటనకు సత్యనారాయణరెడ్డికి సంబంధం లేకపోయినా హత్య కేసుగా చిత్రీకరించారని కాకాణి ఆరోపించారు. ఇప్పటికే సుమారు 97 రోజుల పాటు జైలులో ఉంచినా కక్ష తీరక మళ్లీ హత్య కేసు పేరుతో అరెస్ట్ చేశారని విమర్శించారు. సత్యనారాయణరెడ్డితో పాటు మరో ఆరుగురిని కూడా కేసులో ఇరికించి జైలుపాలు చేశారని కాకాణి ఆరోపించారు. కూటమి నాయకులు తమను ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.
సత్యనారాయణరెడ్డి అరెస్టును ఖండిస్తున్నా: కాకాణి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)