ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ(యం) పోటీ

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 07:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- పట్టణాలలో ప్రజా ప్రణాళిక అమలుకోసం పోరాటం

- సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి - విజయవాడ: రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగరపంచాయతీ ఎన్నికలలో సిపిఐ(యం) 23 జిల్లాల్లో 12 కార్పొరేషన్‌లలో 70 వార్డులు, 47 మున్సిపాలిటీలలో 78 వార్డులు, 3 నగర పంచాయతీలలో 10 వార్డులు మొత్తం 158 వార్డులలో సిపిఐ(యం) చేస్తున్నదనిద ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటించారు. అత్యధికంగా సిపిఐ(యం), సిపిఐ ఉమ్మడి అవగాహనకు వచ్చాయని తెలిపారు. మరికొన్నిచోట్ల స్థానికంగా సిపిఐ సహా ఇతర లౌకిక పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ మేయర్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఎ.బి.వెంకటేశ్వరరావుకు వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతునిస్తున్నాయని, తిరుపతి, కర్నూలు మేయర్ స్థానానికి నామినేషన్ వేశామని తెలిపారు. కర్నూలులో శ్యామల పోటీ చేస్తున్నారని తెలిపారు. తిరుపతిలో సిపిఐతో చర్చించిన తరువాత తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న సిపిఐ(యం) అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని, తద్వారా ప్రజల తరపున, ప్రజలకోసం పోరాడే సిపిఐ(యం)కు బలం చేకూర్చాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్