ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నేతలు, పోలీసులపై జరిగిన భౌతిక దాడులను సిపిఎం ఖండించింది. ఈ దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. దాడిలో వైసిపి నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరిపై రాజకీయంగా ఎదుర్కోవచ్చు కానీ భౌతిక దాడులకు పాల్పడటం సమంజసం కాదని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా అధికార పక్షం చేసిన దాడులను వ్యతిరేకించిన తెలుగుదేశం, నేడు అదే పద్ధతిలో భౌతిక దాడులను సమర్దించడం అప్రజాస్వామికమని విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని, టిడిపి నాయకత్వం ఇలాంటి భౌతిక దాడులను అరికట్టకపోతే శాంతిభద్రతలు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దాడిని ప్రజాతంత్రవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు.
ఉండవల్లి ఘటనపై సిపిఎం ఖండన
27 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 06:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)