ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వియత్నాం బోటు ప్రమాదం మృతులకు సిపిఎం సంతాపం

11 జులై, 2026

Vietnam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 06:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - విజయవాడ: వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రమాదంలో మరణించిన 15 మంది పర్యాటకుల్లో మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, కడప జిల్లాకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నట్లు సమాచారం అందిందని పేర్కొంది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహించిన విహారయాత్ర సందర్భంగా పూక్వాక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని పేర్కొన్న ఆయన, మృతదేహాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహకారం అందించాలని కోరారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్