శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బక్క రైతును బతకనివ్వండి..!

1 గంట క్రితం

adhaar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 01:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చిక్కిపోతున్న బక్క రైతుని

కొంత కాలం బతకనివ్వండి

అన్నం పెట్టే అన్నదాతలకు

గుల్ల సున్నాలు రాయకండి...!

స్వేచ్ఛా వాణిజ్య పుర వీథులలో

కర్షకుల వరి కంకులను రాల్చేటి

వ్యవసాయాన్ని ఉరి తీయకండి

పల్లెలలో పాల వెల్లువలా పొంగే

పాడి పరిశ్రమకు పాడె కట్టకండి..!

భారత దేశమంటే గ్రామీణ భారతం

హరిత విప్లవంతో పురి విప్పిన చిత్రం

పాడిపంటలు పాడి కుండలా వుండగ

రహస్య ఒప్పందాలను చేసుకుంటూ

రైతు, కూలీల బతుకులు ఛిద్రం చేయొద్దు..!

కనీస మద్దతు ధరలు పాలకులివ్వరు

దోపిడీ దళారుల దొంగచాటు దెబ్బలకు

కర్షకులు నిత్యం మానసిక ఘర్షణ పడే

పెద్దన్నతో ఆకస్మిక వాణిజ్య ఒప్పందం

గ్రామీణ భారతానికి మరణ మృదంగం..!

అన్నదాతలూ నడుములు కట్టండి

కూలన్నలూ తలగుడ్డలను చుట్టండి

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద పత్రాలు

వెల్లడి చేసేవరకు పట్టు విడవకండి..!


- జి.సూర్యనారాయణ,

సెల్‌: 6281725659


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్