సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition గొంతుకలను అణచివేసే చర్య

1 గంట క్రితం

sfi image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 12:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎపి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను పునరుద్ధరించాలి

  • ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎస్‌ఎఫ్‌ఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను మెటా సంస్థ ఏకపక్షంగా సస్పెండ్‌ చేయడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. విద్యార్థులు, యువత గొంతుకలను డిజిటల్‌ వేదికల నుంచి తొలగించే ధోరణి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఈ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు విద్యా హక్కులు, విద్యార్థి ఉద్యమాలు, క్యాంపస్‌ సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని దూరం చేస్తున్నారని విమర్శించింది. ఇది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ, సంఘటితమయ్యే హక్కులపై దాడి అని పేర్కొంది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఆదర్శ్‌ ఎం.సాజీ, ప్రధాన కార్యదర్శి సృజన్‌ భట్టాచార్య సోమ‌వారం ప్రకటన విడుదల చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను శాశ్వతంగా నిలిపివేశారని గుర్తుచేశారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించిన విద్యార్థి ఉద్యమం సందర్భంగా ఈ చర్య చోటుచేసుకుందని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ ‌చేశారు. ఖాతాను ఎందుకు సస్పెండ్‌ చేశారో, ఏ నిబంధనను ఉల్లంఘించారో, అందుకు సంబంధించిన ఆధారాలేమిటో మెటా స్పష్టంగా వెల్లడించాలని కోరారు. పారదర్శకమైన వివరణ ఇవ్వాలన్నారు. డిజిటల్‌ వేదికలపై ఆంక్షలు విధించినంత మాత్రాన విద్యాహక్కులు, సామాజిక న్యాయం కోసం సాగుతున్న పోరాటాన్ని ఆపలేరని పేర్కొన్నారు. వీధుల్లోనూ, డిజిటల్‌ వేదికలపైనా తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్